తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిజమైన తెలంగాణా పులిగా అభివర్ణించారు. ఈమేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘విత్ రియల్ టైగర్… టైగర్ ఆఫ్ తెలంగాణా’ అనే కాప్షన్ ను జోడించి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను ఆర్జీవీ ట్విట్టర్ పోస్ట్ చేశారు.

దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేసిన ఈ పోస్టుపై నిమిషాల్లోనే భారీ సంఖ్యలో నెటిజన్లు స్పందించడం విశేషం. కొంపదీసి రేవంత్ రెడ్డితో బయోపిక్ తీస్తున్నారా ఏంటి? అంటూ కామెంట్లు పెట్టారు. ఆర్జీవీ చేసిన ఆయా ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఆర్జీవీ చేసిన ట్వీట్ ను దిగువన మీరూ చూసేయండి.

Comments are closed.

Exit mobile version