మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గొతులోంచి వెలువడినట్లు ప్రాచుర్యంలోకి వచ్చిన బూతు పురాణం బాపతు ఆడియో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆడియోలోని సంభాషణలు తనవి కావని మహేందర్ రెడ్డి చెబుతున్నారు. చివరికి ఈ వ్యవహారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై కేసు నమోదుకు దారి తీయడం విశేషం.

తాండూరులో జరిగిన ఓ జాతర సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై మహేందర్ రెడ్డి తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని ఉద్ధేశిస్తూ ఫోన్ లో బూతు పురాణం వల్లించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. సీఐని దుర్భాషలాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా మండిపడింది. పట్నం మహేందర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం కోరింది.

ఈ ఆడియో వ్యవహారంలో సీఐ రాజేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటించారు. ఇంతకీ సీఐ రాజేందర్ రెడ్డిని దుర్భాషలాడుతూ పట్నం మహేందర్ రెడ్డి అందుకున్న బూతు పురాణానికి సంబంధించిన ఆడియోను దిగువన వినవచ్చు. (ఆడియో: పెద్దలకు మాత్రమే)

https://ts29.in/wp-content/uploads/2022/04/patnam.mp3

Comments are closed.

Exit mobile version