మహబూబాబాద్ జిల్లా అడవుల్లో పెద్దపులి సంచారపు ఆనవాళ్లు కనిపించాయి. జిల్లాలోని గూడూరు అటవీ రేంజ్ పరిధిలో గల నేలవంచ, కార్లాయి అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ ఆవుల మందపై దాడి చేసిన పులి రెండు ఆవులను చంపినట్లు వారు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో గూడూరు అటవీ రేంజ్ పరిధిలో పులి అడుగు జాడల కోసం అటవీ అధికారులు గాలిస్తున్నారు. ఇందులో భాగంగానే పులి ఆనవాళ్ల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. గూడూరు అటవీ రేంజ్ పరిధిలోని ప్రజలు, పశులు కాపర్లు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా స్థానిక అటవీ అధికారులు సూచించారు.

ఫొటో: ప్రతీకాత్మక చిత్రం

Comments are closed.

Exit mobile version