బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు తెలంగాణా సీఎం కేసీఆర్ కీలక సూచన చేశారు. ప్రజలు పల్లెల్లో ఏర్పాటు చేసిన పార్కులకు వెళితే బీపీలు, షుగర్లు మాయమవుతాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రామాల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు బీపీ, షుగ‌ర్ల‌తో పాటు ఇత‌ర జ‌బ్బుల‌తో బాధ‌ప‌డేవారికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మారాయని, ప్ర‌శాంత‌తో పాటు మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయ‌ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో తెలిపారు. శాస‌న‌స‌భ‌లో హ‌రిత‌హారంపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్టిన సంద‌ర్భంగా స‌భ్యులు మాట్లాడిన అనంత‌రం సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు.

గ్రామ‌పంచాయ‌తీల్లో న‌ర్స‌రీలు ఏర్పాటు చేశామని, వీటి ఏర్పాటులో అట‌వీ అధికారుల కృషి విశేషంగా ఉందన్నారు. ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలతో చెట్ల‌ ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశామని, 19,472 ఆవాసాల్లో ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు ఏర్పాటు చేయ‌బ‌డ్డాయని, 13,657 ఎక‌రాల్లో ఈ వ‌నాలు పెరుగుతున్నాయని వివరించారు. ఈ విషయంలో స‌ర్పంచ్‌ల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నానని చెప్పారు. ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాల‌ను స‌ర్పంచ్‌లు, మిగ‌తా అధికారులు అద్భుతంగా తీర్చిదిద్దారని, గ్రామాల్లో బీపీ, షుగ‌ర్‌తో బాధ‌ప‌డేవాళ్ల‌కు ఈ పార్కులు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయి.

కగా మండ‌లానికి ఒక‌టి చొప్పున బృహ‌త్ ప్ర‌కృతి వ‌నాలు ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్నాన్నామని, 526 మండ‌ల్లాలో స్థ‌లాలు గుర్తించి 7,178 ఎక‌రాల్లో ప్లాంటేష‌న్ ప‌నులు విస్తృతంగా జ‌రుగుతున్నాయని చెప్పారు. ప‌ట్ట‌ణాల్లో 109 ఏరియాల్లో 75,740 ఎక‌రాల్లో అర్బ‌న్ ఫారెస్టులు ఏర్పాటు చేస్తున్నారని, 53 అర్బ‌న్ పార్కుల్లో ప‌ని బాగా జ‌రిగిందని, మిగ‌తా ప్రాంతాల్లో కూడా ప‌నులు కొన‌సాగుతున్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో చెట్లు న‌రికివేస్తే రూ. 4 ల‌క్ష‌ల జ‌రిమానా విధించామని, ఇటువంటి అంశాల్లో క‌ఠినంగా వ్యవహరిస్తున్నట్లు కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Comments are closed.

Exit mobile version