అర్థరాత్రి వేళ ముఖ్యమంత్రి కళ్ల ముందు కనిపించేసరికి తమిళనాడు పోలీసుల నివ్వెరపోయారు. అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన శైలిని కనబరుస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో సంచలనం సృష్టించారు. ఇందులో భాగంగానే పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు వినూత్న చర్యలకు దిగారు.

సీఎం స్టాలిన్ అర్థరాత్రి సమయంలో అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. సేలం నుంచి ధర్మపురికి వెడుతూ మార్గమధ్యంలో అద్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ స్టేషన్ పనితీరును, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎం ఇలా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనిఖీలు చేయడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పోలీస్ స్టేషన్‌ను ఎప్పుడు నిర్మించారని ప్రశ్నిస్తూనే కేసులు నమోదవుతున్న తీరు, వాటి పరిష్కారం తదితర విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

సీఎం స్టాలిన్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారినప్పటికీ గత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొన్నింటిని యథావిధిగా కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు అందించే పుస్తకాలపై మాజీ సీఎం జయలలిత ఫొటోలు ఉండగా, వాటిని అలేగా పంపిణీ చేసి ఖజానాపై భారం పడకుండా చూశారు.
అమ్మ క్యాంటిన్లను కూడా కొనసాగిస్తున్నారు. తరచుగా సైకిల్ పై పయనిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

తాజాగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఇలా ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version