సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు వెంకట్రాంరెడ్డి, శరత్ లు తెలంగాణా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన దృశ్యపు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం కేసీఆర్ ఆదివారం సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని, పోలీస్ కమిషనరేట్ భవనాన్ని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన తర్వాత జిల్లా కలెక్టర్ ఛాంబర్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని సీఎం కేసీఆర్ కుర్చీలో కూర్చోబెట్టారు.

అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే తన కుర్చీలోంచి లేచిన కలెక్టర్ వెంకట్రాంరెడ్డి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన ఘటన వివాదాస్పదమైంది. ఈ సంఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను దిగువన మీరూ చూసేయండి.

కాగా సిద్దిపేట కలెక్టర్ తరహాలోనే కామారెడ్డి కలెక్టర్ శరత్ కూడా సీఎం కేసీఅర్ కాళ్ళు మొక్కడం గమనార్హం. సిద్దిపేటలో పర్యటన ముగించుకున్న సీఎం ఆ తర్వాత కామారెడ్డికి వెళ్లారు. ఇక్కడ కూడా సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఈ దృశ్యం చోటు చేసుకుంది. కలెక్టర్ శరత్ సీఎం కేసీఅర్ కాళ్ళు మొక్కుతున్న వీడియోను కూడా దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version