తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం దుద్దెడ శివారులో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టర్‌ భవనాన్ని, పోలీస్ కమిషనరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారో కేసీఆర్ మాటల్లోనే…

  • ప్రగతి ఫలాలు ప్రతి గడపకు అందాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం.
  • రాష్ట్రంలో నాలుగు వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేస్తాం.
  • 1969లో సిద్దిపేట గడ్డమీద తెలంగాణ నినాదం మొదలైంది.
  • తాగునీటి కోసం ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
  • కనీసం అంత్యక్రియలకు నీళ్ళు ఉండేవి కావు.
  • గత ప్రభుత్వాల్లో నేల విడిచి సాము చేశారు.
  • నీళ్ళు, కరెంటు కోసం గోస పడ్డాం.
  • కాకతీయుల నాటి గొలుసు కుట్టు చెరువులు సమైక్య రాష్ట్రంలో ధ్వంసం చేశారు.
  • రాష్ట్రం ఏర్పాటుకు నాలుగు నెలల ముందుగానే స్వప్నించి మిషన్ కాకతీయ పేరు పెట్టాం.
  • దేశానికి ధాన్యాగారమైన పంజాబ్ ను అధిగమించాం.
  • తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల టన్నుల‌ ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు ఉండేవి…నేడు 25 లక్షలకు పెంచాం.
  • చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది.
  • తాగునీటికి, విద్యుత్ కు కొరత లేదు.
  • కొన్ని రాజకీయ పార్టీల నేతలకు సిగ్గు,శరం లేదు.
  • ఇప్పటి వరకు వ్యవసాయంపై సరైన లెక్కలు లేవు.
  • అధికారులకు నన్ను చూస్తూనే భయం పట్టుకుంది.
  • ప్రతి ఐదు వేల మందిని క్లష్టర్ గా రైతు వేదిక నిర్మించాం.
  • సిద్దిపేట చైతన్యానికి ప్రతీక.
  • నాటువేసే బదులు వెదజల్లుడు పద్దతి మంచిది.
  • వెదజల్లే పద్దతిలో సిద్దిపేట అగ్రగామి కావాలి.
  • గుజరాత్ లో పత్తి బాగా పండుతుంది కానీ, తెలంగాణ పత్తికి మంచి డిమాండ్ ఉంది.
  • రైతు కేంద్రంగా ప్రభుత్వం పని చేస్తుంది.
  • రైతు చల్లగా ఉంటే దేశం బాగుంటుంది.
  • రైతుకు సహాయం చేయాలనే ఆలోచన నుంచి వచ్చిందే రైతు బంధు.
  • రైతుకు ఇబ్బందులు లేకుండా చేయడమే రైతు రాజ్యం.
  • రాష్ట్రంలో భూ సమస్యలు ఎక్కువ… పరిష్కారం కోసం మూడేళ్ళు శ్రమించాం.
  • పహాణీలో 37 కాలమ్ లు తీసేసి మూడే కాలమ్ లు పెట్టాం.
  • ధరణిలో పేరు ఉందంటే నిశ్చింతంగా ఉండొచ్చు.
  • నకిలీ విత్తనాలు అమ్మితే ఉక్కుపాదం మోపుతాం.
  • రైతు చనిపోతే ఆకుటుంబానికి ధీమా రైతు భీమా పథకం.
  • పేద వర్గాలకు ఇంకా మంచి జరగాల్సి ఉంది.
  • కుల మతాలకు అతీతంగా సంక్షేమము జరుగుతుంది.
  • ఎన్టీఆర్ తీసుకు వచ్చిన రెండు రూపాయలు కిలో బియ్యం పథకం చాలా బాగా నచ్చింది.
  • ప్రజా ప్రతినిధులు మీద చాలా పెద్ద బాధ్యత ఉంది, నేల విడిచి సాము చేయవద్దు.
  • రాష్ట్రంలో 98.6 శాతం వైకుంఠ ధామాలు పూర్తి అయ్యాయి.
  • ఆక్సిజన్ కొనుక్కోవడం అంటే సమాజం సిగ్గు పడాలి.
  • గత ప్రభుత్వాలు నేల విడిచి సాము చేశాయి, పెద్ద పెద్ద డైలాగు లు చెప్పారు.
  • ఆకస్మిక తనిఖీ అంటే అధికారులు, సర్పంచ్ లను బద్నాం చేయడం నా ఉద్ధేశం కాదు.
  • చాలా మంది పిచ్చి కూతలు కూస్తున్నారు, అవేమి పట్టించుకోం.
  • భగీరధ చూడడానికి 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు.
  • కాళేశ్వరం కడితే కొన్ని కుక్కలు మొరిగాయి.
  • మల్లన్న సాగర్ అయిపోతే నెత్తి మీద కుండ ఉన్నట్లే.
  • నేను బయలు దేరిన నాడు తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదు.
  • 100 శాతం బంగారు తెలంగాణ అయి తీరుతుంది.
  • నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్ పేరు దేవుడు పేరు పెట్టాం.
  • మిడ్ మానేరు నాసి రకం గా కట్టామని చిల్లర రాజకీయాలు చేశారు.
  • ఎందుకు పనికి రాని వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు.
  • దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో కొన్నట్లు ధాన్యం కొనలేదు.
  • తెలంగాణకి సరి పోయే రైస్ మిల్లులు లేవు.
  • కొనుగోలు కేంద్రాలు దగ్గర రాజకీయ పార్టీలు ధర్నాలు కి ప్రయత్నం చేస్తే రైతులు తన్ని పంపారు.
  • దళిత వర్గం పేదరికం లో ఉంది, అసమానతలు పోవడం లేదు.
  • వాటిని పోగొట్టడానికి సీఎం దళిత ఎన్ఫోర్మేంట్ ప్రోగ్రాం కోసం బడ్జెట్ లో రూ. 1,000 కోట్లు కేటాయించాం.
  • ఇండియాలోనే నంబర్ వన్ ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ.
  • నేను పుట్టిన గడ్డ ఆదర్శ జిల్లా కావాలి.
  • సిద్దిపేట వర్ధిల్లాలి, తెలంగాణ వర్ధిల్లాలి.

Comments are closed.

Exit mobile version