జర్నలిస్ట్: లాహోర్ లో ఉండడం ఎలా అనిపిస్తుంది?
గేదె: (అరుపు)
జర్నలిస్ట్: ఈ గేదెకు లాహోర్ నచ్చింది…
జర్నలిస్ట్: లాహోర్ ఫుడ్ బాగుందా? లేక మీ ఊరి ఫుడ్ బాగుందా??
గేదె: (మళ్లీ అరుపు)
జర్నలిస్ట్: గేదె మళ్లీ అరిచింది. లాహోర్ ఫుడ్డే బాగుందట…
ఏమిటీ సంభాషణ అనుకుంటున్నారా? పాకిస్థాన్ కు చెందిన అమీన్ హఫీజ్ అనే జర్నలిస్ట్ లాహోర్ లో ఓ గేదెతో సంభాషిస్తూ వేసిన ప్రశ్నల సరదా ఇంటర్వ్యూ సారాంశమిది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను నైలా ఇనాయత్ అనే మరో జర్నలిస్ట్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఆయా వీడియోను దిగువన మీరూ చూసి సరదాగా నవ్వుకోండి మరి!