Facebook Twitter YouTube
    Monday, May 29
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»International News»చైనాకు అమెరికా ‘షాక్’!

    చైనాకు అమెరికా ‘షాక్’!

    December 17, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 biden

    చైనాకు అమెరికా గట్టి ‘షాక్’నిచ్చింది. చైనా దేశపు బయోటెక్ పై, నిఘా కంపెనీలపై, ప్రభుత్వ సంస్థలపై తాజాగా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించడం విశేషం. యుగుర్‌ ముస్లింలపై చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందనే ఆరోపణలు చేస్తూ అమెరికా ఇందుకు ఉపక్రమించడం గమనార్హం.

    ts29 bbf2

    అమెరికా తాజా చర్యతో చైనా సంస్థలకు లైసెన్సు లేకుండా ఎలాంటి ఉపకరణాలను అగ్రరాజ్య కంపెనీలు విక్రయించకూడదు. చైనా సైన్యానికి మద్దతుగా బయోటెక్నాలజీని ఉపయోగిస్తున్న చైనా అకాడమీ ఆఫ్‌ మిలటరీ మెడికల్, సైన్సెస్‌ దానికి సంబంధించిన 11 పరిశోధన సంస్థలను అమెరికా వాణిజ్య శాఖ లక్ష్యంగా చేసుకుంటుండడం మరో విశేషం.

    బయోటెక్, వైద్య ఆవిష్కరణలను ప్రజలపై నియంత్రణ, మతపరమైన మైనార్టీల అణచివేతకు చైనా ఉపయోగిస్తోందని అమెరికా వాణిజ్య శాఖ సెక్రటరీ గినా రైమాండో ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పథకం ప్రకారం యుగుర్లను అణచివేతకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా అధికారులు ఆరోపించారు. అక్కడ బయోమెట్రిక్‌ ముఖ గుర్తింపు వ్యవస్థతో కూడిన అధునాతన నిఘా సాధనాలను డ్రాగన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 12-65 ఏళ్ల మధ్య వయస్కుల డీఎన్‌ఏ నమూనాలను సేకరించిందని కూడా పేర్కొన్నారు.

    మరోవైపు షింజియాంగ్‌ నుంచి తమ దేశానికి అన్ని దిగుమతులను నిషేధిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు అమెరికా సెనేట్‌ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేయడం లాంఛనప్రాయంగానే అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. 

    china USA Uyghurs అమెరికా చైనా యుగుర్లు
    Previous Articleఒమిక్రాన్ ‘తొలి’ కంటైన్మెంట్ జోన్!
    Next Article హన్మకొండలో ‘ఒమిక్రాన్’ కలకలం

    Related Posts

    చైనాలో బీభత్స దృశ్యాలు

    July 21, 2021

    చైనా మార్కెట్లో నకిలీ ‘వ్యాక్సిన్’ కలకలం

    February 3, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.