మరిపెడ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సస్పెన్షన్ కు దారి తీసిన అత్యాచార యత్నం ఘటన పూర్వాపరాలు సంచలనం కలిగిస్తున్నాయి. మరిపెడ స్టేషన్ లో ప్రొబేషనరీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు అధికారిపై ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అత్యాచార యత్నం చేశారనే అభియోగంపై ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే.

వరంగల్ నార్త్ జోన్ ఐజీ వై. నాగిరెడ్డి జారీ చేసిన శ్రీనివాసరెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులో ఘటన పూర్వాపరాలను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఉత్తర్వులోని అంశాల సారాంశం ప్రకారం… ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ట్రైనీ మహిళా ఎస్ఐకి తరచూ మెసేజ్ లు పంపిస్తూ, ఆ వెంటనే డిలీట్ చేసేవాడు. చాలా సందర్భాల్లో ఇలాగే ఎస్ఐ వ్యవహరించాడు.

సోమవారం రాత్రి 11.38 గంటలకు ట్రైనీ మహిళా ఎస్ఐని ‘రెయిడ్’ ఉందనే నెపంతో శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్ కు పిలిపించాడు. బెల్లం అక్రమ రవాణాకు సంబంధించి రెయిడ్ నిర్వహించాలని వెల్లడిస్తూ ప్రయివేట్ వాహనంలో ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఎస్ఐ తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె శరీరాన్ని తాకుతూ దుస్తులు చించాడు. ఇదే సందర్బంగా మహిళా ఎస్ఐ ప్రయివేట్ పార్టులను టచ్ చేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ తనతో గడపాలని భయపెట్టాడు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం… ఆయా అంశాలను ఐజీ నాగిరెడ్డి తన ఉత్తర్వులో ప్రస్తావిస్తూ ఎస్ఐ శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి విచారణ జరుగుతుందని, హెడ్ క్వార్టర్స్ విడిచి ఎక్కడికీ వెళ్లరాదని ఐజీ నాగిరెడ్డి ఎస్ఐని తన ఉత్తర్వులో ఆదేశించారు.

ఫొటో: ప్రతీకాత్మక చిత్రం

Comments are closed.

Exit mobile version