మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ పి. శ్రీనివాసరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద, అత్యాచార యత్నం అభియోగంపై కేసు నమోదైంది.

ఈమేరకు అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపర్చగా, జడ్జి 14 రోజులు రిమాండ్ విధించినట్లు మానుకోట ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రకటించారు. ఈమేరకు ఎస్ఐ శ్రీనివాసరెడ్డిని మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించామన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, తప్పు చేస్తే ఎంతటివారైనా సరే శిక్షింపబడతారని ఎస్పీ కోటిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిపెడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డిపై అత్యాచారయత్నం అభియోగం వచ్చిన సంగతి తెలిసిందే. ట్రైనీ మహిళా ఎస్ఐ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఇందులో భాగంగానే ఫిర్యాదు వచ్చినరోజే ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత అతనిపై కేసు నమోదు, అరెస్ట్, జైలుకు తరలించడం వంటి పరిణామాలు వేగంగా జరిగాయి.

Comments are closed.

Exit mobile version