దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. కోల్ కతాలో గురువారం కిలో ఉల్లిపాయల ధర రూ. 150కి చేరుకోగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూ. 100 నుంచి రూ. 120 మధ్య విక్రయిస్తున్నారు. ఉల్లి ధర మున్ముందు రూ. 200కు చేరవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

భగ్గుమంటున్న ఉల్లి ధరలపై కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియాలో బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ వర్గాలు ఉల్లి ధరలపై గతంలో బీజేపీ నేతలు చేసిన ఆందోళనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.

‘‘కాంగ్రెస్ హయాంలో ఉల్లిపాయల ధర పెరిగినపుడు బీజేపీ నేతలు హడావిడి చేశారు. మంచిదే. కానీ ఇప్పడు మాట్లాడడంలేదు?.’’

‘‘వీళ్లంతా ఎవరో గుర్తున్నారా?’’ అంటూ ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఉల్లి ధరల అంశంలో అప్పట్లో బీజేపీ నేతలు చేసిన యుద్ధంపై చర్చ కూడా జరుగుతోంది.

Comments are closed.

Exit mobile version