సన్నీలియోన్ పుట్టినిల్లు నట్టింట్లో నాట్యమాడుతుంటే? నాన్నా పోర్న్ స్టార్ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు ఆ తండ్రి తల ఎక్కడ పెట్టుకోవాలి? ఓ బజారుదాన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకువచ్చిందెవరు? ‘దొబ్బెయ్’ అనే బూతు పదాన్ని మామూలు మాటగా మార్చిందెవరు? గుడిసుందీ, మంచముందీ, వంగమాకు అనే పాటల పల్లవిని ఆలపించిందెవరు? జ్యోతిలక్ష్మి గెంతులు, మంజుల కవ్వింతలకు కారకులెవరు? డాక్టర్ సమరం ఇచ్చే సలహాలకు సెక్స్-సైన్స్ పేరుతో విస్తృత ప్రచారం కల్పించిన పాత్రికేయ పెద్దలనే కాదు అనేక మందిని నిలబెట్టి ప్రశ్నించాడు ఈ రచయిత. ఈ ప్రశ్నలను సంధించిన రచయిత పేరును తానే పెట్టుకోలేదో, లేదా కాపీ, పేస్ట్ చేసినవారు అతనికి పేరు రావడం ఇష్టం లేక తొలగించారో తెలియదుగాని, ఎవరో టీచర్ రాసినట్లు కథనం చదివాక స్పష్టమవుతోంది. ఆద్యంతం చదివించే అసక్తికర కథనమిది. దిశ హత్యోదంతానికి బీజం ఈనాటిది కాదని, దశాబ్ధాల క్రితం నుంచి సాగుతున్న దరిద్రపు రుగ్మతగా రచయిత అభివర్ణించిన తీరు ఆలోచించాల్సిన అంశమే. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ పోస్టులోని కొన్ని అనవసర పదాలను ఎడిట్ చేయనైనది. ఇక చదవండి.

దిశ మరణం తర్వాత కలిగిన ఆలోచనలు:

దిశ మరణానికి కారణం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం.
ఇది ఒక్క రోజులో చోటు చేసుకోలేదు.

ఒక చక్కటి విలువలున్న సినిమా చూసి బయటికి వస్తే అదే ప్రభావం మన మీద చాలా సేపు వుంటుంది.
‘సత్య హరిశ్చంద్ర ’ సినిమా చూసొస్తే చాల రోజుల పాటు ఆ ప్రభావం వుంటుంది. మన అంతరాత్మ మనల్ని అబద్దం చెప్పకుండా అడ్డం పడుతుంది.

అవునంటారా కాదంటారా?
ఒక డొక్కు సినిమా చూసొస్తే దాని తాలుకు ప్రభావం కూడా మన మీద వుంటుంది. మాకు డొక్కు సినిమాలు వద్దు అని నిర్మాతలని , దర్శకులని నిలదీసి అడిగే ప్రేక్షక సంఘాలు బయలు దేరాలి.

“నాన్నా పొర్న్ స్టార్ అంటే ఏమిటి?” నా పదకొండేండ్ల కొడుకు 2012 లో ఈ ప్రశ్న అడిగినప్పుడు నాకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. ఒక తండ్రి వాపోయాడు.
ఒక బజారు దాన్ని మెయిన్ స్ట్రీం సినిమాకు తీసుకు వచ్చింది కూడా ఒక మహిళనే అని.
ఆ పిల్లవాడి తప్పేం లేదు. ఎక్కడ చూసినా సన్నీలియోన్ భజనే ఆ రోజుల్లో. సరిగ్గా అదే సంవత్సరం పూజా భట్ అనే ఒక గొప్ప మహిళా దర్శకురాలు ఈ ఉత్తమ నటిని మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ’జిస్మ్ -2’ అనే ఒక అభ్యుదయ చిత్రం ద్వారా ప్రవేశపెట్టింది. ఆ కారణంగా పిల్లవాడు ఆ ప్రశ్న వేశాడు. ప్రశ్నలే కదా? మన తెలివితేటలని పదునుపెట్టేది.
ఆ రోజుల్లో ఏ చానల్ తెరిచి చూసినా, ఏ వార్తా పత్రిక తిరగేసినా ఈ సన్నీ లియోని ఫోటోలు, ఇంటర్వ్యూలు కనపడేవి. ఈ విధంగా ఈ మహిళామణి దయవలన మన నిత్య జీవిత సంభాషణలలో కి పోర్న్, పోర్న్ స్టార్ అనే మాటలు సర్వ సామాన్యమయిపోయాయి.
రవితేజ సినిమాలు, మహేష్ బాబు ఖలేజా సినిమాల పుణ్యమా అని “దొబ్బేయ్” అన్న మాట ఎంత మామూలు అయిపోయిందో, సన్నీలియొని పుణ్యాన పోర్న్, పోర్న్ స్టార్ అన్నపదాలు మామూలు మాటలు అయిపోయాయి.

నేను మొన్న అమేజాన్ ప్రైమ్ లో అనుకుంటా, రాజశేఖర్ సినిమా ‘గరుడవేగా” చూద్దామని కూర్చున్నాము మా ఆవిడ పిల్లలతో కలిసి. అందులో ఒక మెరుపు పాటలో చాలా మాములు నటి లాగా వచ్చి మన సన్నీలియోని డాన్సాడి పోయింది.
అంటే విలువలు ఎలా మారిపోతున్నాయో చూడండి.

చిరంజీవి గారు కూడా తెగ బాధపడిపోతున్నారు దిశ ఉదంతం గురించి. మరి ఆయన ఘరానా మొగుడు మున్నగు సినిమాలలో దాదాపు నీలి చిత్రాల స్థాయిలో వానపాటలకు గెంతులు వేసిన సందర్భాలు మరిచిపోయారనుకుంటాను.
మహేష్ బాబు కావచ్చు, చిరంజీవి కావచ్చు ఏ ఇతర సినీ ప్రముఖుడు కావచ్చు, ఈ సందర్భంగా మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు వీరందరూ కూడా ప్రస్తుత సమాజపు వికృత రూపానికి ప్రత్యక్ష కారణాలు.
ఒక్క సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఆర్పీ పట్నాయక్ గార్లకి తప్ప సామాజిక బాధ్యత ఏ ఒక్క సినీ ప్రముఖునికీ ఉన్నట్టు తోచదు. వీరిద్దరికి తప్ప మిగతా వారెవ్వరికి మాట్లాడే అర్హత లేదు. మిగతా వారు కనీసం నోర్లు మూసుకుని మౌనంగా వున్నా కూడా సంతోషమే.
నేను ఎంతో అభిమానించే గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా మినహాయింపు కాదు నా ఆరోపణలలో. వీరు పాడిన కొన్ని పాటలు (చక్రవర్తి గారి సంగీతం లో వేటూరి గారి పాటలు) సాక్షాత్తు బజారు పాటలే.
‘గుగుగుడిసుందీ’
‘వంగమాకు, వంగమాకు’ ఇలా ఎన్నో పాటలు.

విలువలు అన్నవి ఒక్క రోజులో దిగజారలేదు.
జయమాలిని, జ్యోతిలక్ష్మిల గెంతులు, మంజుల కవ్వింతలు ఇవన్నీ ప్రారంభం మాత్రమే. నాకు ఆరు ఏడు సంవత్సరాల వయస్సు లో సినీ నటి మంజుల ని చూసి తెగ సంచలనానికి గురయ్యేవాడిని. ఆ పోస్టర్ల ప్రభావం ఆవిడ డ్రెస్సుల ప్రభావం అలా వుండేది.

ఆ తరువాత మన పత్రికలు కూడా ఏమీ తక్కువ తినలేదు. మన ఘనత వహించిన రామోజీరావు గారు, ఈనాడు ఆదివారం అనుబంధం లో (అప్పుడు అది కూడా వార్తాపత్రిక సయిజులోనే వచ్చేది) డాక్టర్ జీ. సమరం గారి ’సెక్స్- సైన్స్’ అన్న వ్యాస పరంపర ఇచ్చేవారు. దానిని యం.శేషాచలం పబ్లికేషన్స్ వారో, నవభారత్ పబ్లికేషన్స్ వారో, గ్రంధాలుగా కూడా అచ్చు వేయించారు.

మన వేమూరి బలరాం గారు పాపం తనవంతుగా ’సుఖ సంసారం’ అని చెప్పి సకుటుంబ సపరివార పత్రిక స్వాతి లో అచ్చువేయించే వారు, అంతటితో అగిపోక ’వారం వారం ఒక సరస కథ’ దానికి ‘జే’ అనే అరవ ఆర్టిస్టు వేసే సభ్యతా సంస్కారాలు ఉట్టిపడే పతివ్రతల బొమ్మలు ఇవి కొనసాగాయి. ప్రజలకు ఇవన్నీ మామూలే అన్న భావన క్రమంగా జొప్పింపబడింది. ఇక సినిమాలు, కుటుంబ సమేతంగా వెళ్ళే సినిమాలో హిరో అనబడే అడ్డగాడిద ఎన్ని నీతిమాలిన పనులైనా చెయొచ్చు. అది మనం హాయిగా ఎంజాయ్ చేస్తూ చూడోచ్చు. అదంతా వినోదం మాత్రమే అని మనం అనుకోవాలి.

ఉండేది ఉండంగా ఇంటర్నెట్ విప్లవం కారణంగా ఇప్పుడు బూతు అరచేతిలోకి వచ్చేసింది. సెన్సార్ పరిధుల్లోకి రాని వెబ్ సిరీస్ లు , రాంగోపాల్ వర్మ లాంటి పయోముఖ విషకుంభ మేధావులు ఇప్పుడు విచ్చలవిడిగా తమ తమ పైత్యాలను వెబ్ సీరీస్ ద్వారా వెళ్ళగ్రక్కుతున్నారు.
ఇక సన్నీలియోని పుట్టినిల్లు లాంటి పోర్న్ సైట్లు గుడ్డలిప్పి నట్టింట్లో నాట్యమాడుతున్నాయి.

కానీ సంఘ నియమాలలో మార్పులు ఏమీ లేవు. అవన్నీ చూడొచ్చు, మన పిల్లవాడు రాముడు మంచి బాలుడు అన్నట్టు వుండాలి. ఇది ఎలా సాధ్యం? తెలిసీ తెలియని వయస్సులోనే అన్నీ చూడగలుగుతున్నారు.
దానికి తోడు సామాజిక మాధ్యమాల కారణంగా విపరీతమైన భావప్రకటనా ‘స్వాతంత్ర్యం.’

పాఠాలు బోధించే టీచర్లు ఎంత చక్కగా వున్నారొ చూద్దాము.
పాపం ఈ టీచర్లు సినిమా హీరోయిన్లని ఆదర్శంగా తీసుకుని, బొడ్డు క్రిందకు చీరలు, చేయి ఎత్తెతే చంకలు, ముందుకు వంగితే స్థన ద్వయ దర్శనం , వెనుక సమాజానికి అంకితం అన్నట్టు వీపు, అన్నట్టుగా ముస్తాబయ్యి స్కూలుకు వస్తున్నారు.
జన్మ సంస్కారం వున్న మొగ పిల్లలు బుద్దిగానే వుంటున్నారు.
ఇలాంటి అవతారాల్లో వచ్చే టీచర్లు చెప్పేనీతులు, ఇదిగో ఇందాకటి మన సినీప్రముఖులు చెప్పేనీతులలాగానే వుంటాయి. గౌరవం అనేది డిమాండ్ చేస్తే రాదు కద.
ప్రత్యక్షంగా విద్యా వ్యవస్థలో వున్నవాడిని కనుక నాకు తెలుసు విద్యా సంస్థలు రక్తమోడుతున్నాయి, అన్ని విధాలా.
డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, బీర్లు, విస్కీలు ఇవి ఏర్లై ప్రవహిస్తున్నాయి కళాశాలలో. పదవ తరగతి కూడా దాటని పిల్లలకు అబార్షన్లు, లేచిపోవటాలు మామూలు విషయాలు అయ్యాయి.
పాపం కొందరు స్కూలు మాష్టార్లు కూడా ఇలాంటి “పవిత్ర” కార్యాలలో తమ వంతు కృషి చేస్తూ సమాజపు ప్రస్తుత ముఖ చిత్రానికి మరిన్ని వన్నెలు అద్దుతున్నారు.
ప్రస్తుతం సమాజం ఒక భయంకరమైన వలయంలో ఇరుక్కుంది.
షాద్ నగర్ లో ప్రజలు పోలీసు స్టేషన్ బయట చూపిన చైతన్యం మరువరానిది. కాని మన ఆగ్రహం మూల కారణాలని గుర్తించటంలో విఫలమవుతోంది.

ఈరోజు కొందరు మేధావులు వాట్సాప్ లో , ఫేస్ బుక్ లో కొన్ని వీడియొలు పెట్టారు. అందులో వేరే మత చాందస దేశాలలో రేపిస్టులకు బహిరంగ శిరచ్చేదనం, బహిరంగంగా గన్ తో కాల్చి చంపటం వంటి దృశ్యాలు పెట్టి ఇవే శిక్షలు ఇక్కడ కూడా అమలు చేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
అంటే ఏమిటి మనం ఆటవిక న్యాయం వైపు కు అడుగులు వేద్దామా?
అసలు సమస్యని మూలాల్లోకి వెళ్ళీ ఆలోచించేది మానేసి, తాత్కాలికి హింసావాద పరిష్కారాలు వెదుక్కుందామా?

బావి సమాజం మంచి దారి నడవాలని ఆశిస్తూ…

Comments are closed.

Exit mobile version