డబ్బు సంపాదనే ధ్యేయంగా, యూనిఫాం ధరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ నకిలీ పోలీసును ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితున్ని మోరంపల్లి బంజారా మండలం అంజనాపురానికి చెందిన గుగులోత్ అఖిల్ నాయక్ (20)గా గుర్తించారు.

కూసుమంచి సీఐ కథనం ప్రకారం…కూసుమంచి పోలీసు స్టేషన్ పరిధిలో వాహనదారులను బెదిరించి ఇతను డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పోలీసుగా, ఫారెస్ట్ బీట్ అఫీసర్ గా, రైల్వే ఉద్యోగిగా యూనిఫాం ధరించి ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.

ఎంతో రహస్యంగా అఖిల్ నాయక్ సాగిస్తున్న నకిలీ దందాకు అరెస్ట్ ద్వారా చెక్ పెట్టారు. ఇటీవల సంధ్య తండా వద్ద ఇసుక ట్రాక్టర్ల నుండి వసూళ్ళకు పాల్పడుతున్నట్లు ఓ వ్యక్తి అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కూసుమంచి మండలం లొని శివలయం క్రాస్ రోడ్డు వద్ద నిందుతుడైన అఖిల్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ ఆనంతరం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కూసుమంచి సీఐ సతీష్ , ఎస్సై ఇంద్రసేనారెడ్డి వివరించారు.

Comments are closed.

Exit mobile version