ఖమ్మం నగరంలో తీవ్ర సంచలనానికి దారి తీసిన ఘటన ఇది. మాజీ జర్నలిస్టు, ప్రస్తుత రియల్టర్ తుళ్లూరి శ్రీనివాస్ ను హత్య చేసేందుకు టీఆర్ఎస్ నేత ఒకరు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. రియల్ వ్యాపారంలో శ్రీనివాస్ తో పాత కక్షలు ఉన్నట్లు ఆరోపణలు గల టీఆర్ఎస్ నేత, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు, ఖమ్మం అర్బన్ మండలంలోని ఓ సహకార సొసైటీకి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

రియల్టర్ తుళ్లూరి శ్రీనివాస్ ను హత్య చేసేందుకు టీఆర్ఎస్ నేత కిరాయి హంతకులతో రూ. 25 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇందుకు అడ్వాన్సు కూడా ఇచ్చారని, కొద్ది రోజుల క్రితం రియల్టర్ ను హత్య చేసేందుకు విఫలయత్నం చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిరాయి హంతకుల నుంచి రెండు వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటనలో టీఆర్ఎస్ నేతతోపాటు రామన్నగూడెం, దానవాయిగూడెం గ్రామాలకు చెందిన మరో ముగ్గురు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Comments are closed.

Exit mobile version