‘ఏటి… ఈ ఫుడ్డేంటి? ఏటి సంగతేంటి?? ఏటి బావుంది? నువ్వూ… ఒచ్చేస్తావాా? భోంచేద్దాం ఇక్కడ…’ అంటూ ఓ గ్రామ సర్పంచ్ ప్రభుత్వ అధికారిని నిలదీశారు. తాను యాక్షన్ లోకి వెళ్లిపోతానని, విజయవాడకు వెళ్లి సీఎంను కలుస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఓ గ్రామ సర్పంచ్ అత్యంత ధైర్యంగా ప్రభుత్వాధికారికి హెచ్చరిక జారీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాకపోతే ఆమె సర్పంచ్ మాత్రమే కాదు, ఆంధప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం సతీమణి కూడా. పేరు తమ్మినేని వాణిశ్రీ. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆమె సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం పంచాయతీ సర్పంచ్‌గా వాణిశ్రీ ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పంచాయతీలోని తమ్మయ్యపేట గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆమెకు అనేక సమస్యలను ఏకరవు పెట్టారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ వాణిశ్రీ సందర్శించగా, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినలేకపోతున్నారని తల్లిదండ్రులు సర్పంచ్ కు ఫిర్యాదు చేశారు. భోజనాన్ని పరిశీలించిన ఆమె వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి ఏం మాట్లాడారో దిగువన గల వీడియోలో చూపేయండి.

Comments are closed.

Exit mobile version