అనగనగా ఓ ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రితో ఓ విలేఖరి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూ ఎలా ఉండడమేంటి అంటారా? ఒక్కో ఇంటర్వ్యూ ఒక్కో రకంగా ఉంటుంది మరి. విలేకరి వేసే ప్రశ్నలకు, ఆ నాయకుడు ఇచ్చే జవాబులు తుంటర్వ్యూ తరహాలోనూ సాగుతుంది. కొన్ని వర్తమాన, సమకాలీన అంశాలు గుర్తుకు వస్తుంటాయి. కవి వైఎన్ రెడ్డి ఫేస్ బుక్ నుంచి సంగ్రహించినట్లు పేర్కొంటున్న ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరదాగా తీసుకుని చదవడం ద్వారా మీరూ కాసేపు నవ్వుకోండి.

ప్రశ్న: దళితుడిని ముఖ్యమంత్రి ఎందుకు చెయ్యలేదు…?
జవాబు: మూడు ఎకరాలు ఇద్దామని.

ప్రశ్న: మరి ఎందుకు ఇవ్వలేదు?
జవాబు: డబుల్ బెడ్ రూమ్ ఇద్దామని.

ప్రశ్న: అది కూడా ఇవ్వలేదు కదా?
జవాబు :ఇంటికో ఉద్యోగం ఇస్తే, వాళ్ళే కట్టుకుంటారని ఇవ్వలేదు..

ప్రశ్న: మరి ఉద్యోగాలు కూడా లేవుకదా?
జవాబు: KG to PG ఇచ్చి, వారికి ట్రైనింగ్ ఇచ్చాక ఇస్తాం.

ప్రశ్న: ఎప్పటి నుంచి ప్రవేశపెడతారు?
జవాబు: బంగారు తెలంగాణా అవగానే.

ప్రశ్న: ఎపుడు అవుతుంది?
జవాబు: ప్రాజెక్టులు పూర్తవగానే.

ప్రశ్న: ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి?
జవాబు :చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు

ప్రశ్న: మరి మీరేం చేస్తున్నారు?
జవాబు: మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికీ నల్లా
ఇస్తున్నాం.

ప్రశ్న: ఎక్కడా రావటం లేదు కదా?
జవాబు: మిషన్ కాకతీయ పూర్తవగానే చెరువులు నిండి నీరు పుష్కలంగా అందుబాటు లోకి వచ్చాక.

ప్రశ్న: మిషన్ కాకతీయ ఎందుకు పూర్తి చేయలేక
పోయారు?
జవాబు: అక్రమ కట్టడాలు తొలగించాలి.

ప్రశ్న: అక్రమ కట్టడాలు తొలగించలేదు కదా?
జవాబు: ఆంద్రోళ్ళు గోలపెడతారని.

ప్రశ్న: వాళ్ళని తెగ తిడుతున్నారు కదా?
జవాబు: లే…లే… నేనెందుకు తిడతా… నాకేమన్నా పిచ్చా? వాళ్ళ కాళ్ళలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా.

ప్రశ్న: మరి…వాళ్ళే తెలంగాణా ద్రోహులు అన్నారుగా…?
జవాబు: ఉద్యమం సమయంలో లక్ష అంటాం.

ప్రశ్న: లక్ష అంటే గుర్తొచ్చింది. రామోజీ పిల్మ్ సిటీని లక్ష నాగళ్ళతో దున్నుతామన్నారుగా?
జవాబు : అన్ని ట్రాక్టర్లు దొరకలా. ఎన్ని ఉన్నాయో లెక్క వేద్దామని కొంగరకలాన్లో మీటింగ్ కి ట్రాక్టర్ ర్యాలీ పెట్టించా… లచ్చ రాలేదు.

ప్రశ్న: మరి తరువాత మీ ప్రోగ్రాం?
జవాబు: ట్రాక్టర్లు లేకపోతే ఏమయింది? ఇంటింటికీ
బర్రెలు, గొర్రెలు ఇచ్చాం. వాటిని అక్కడకి తోలి రామోజీ ఫిల్మ్ సిటీని స్వాధీనం చేసుకుంటాం.

ప్రశ్న: బర్రెలు, గొర్రెలు ఇవ్వటంలో ఆంతర్యం?
జవాబు : ఇంకా అర్దం కాలేదా? (అని నవ్వులు..)

Comments are closed.

Exit mobile version