ధరణి పోర్టల్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వివిధ మార్గాలను చూపింది. ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు వాట్సాప్, ఈ మెయిల్ లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే వినతులు పంపేందుకు వాట్సాప్, ఈ-మెయిల్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్ కుమార్ తెలిపారు.
‘‘వినతులు పంపాల్సిన వారు వాట్సాప్ నంబర్: 9133089444, Ascmro@Telangana.gov.in కు మెయిల్ చేయొచ్చన్నారు. త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. సీసీఎల్ఏ, రిజిస్ట్రేషన్లు, ఐటీ విభాగాల అధికారులను సభ్యులుగా నియమించినట్లు సీఎస్ వెల్లడించారు.