ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది గూగుల్ లో ప్రజలు ఏయే అంశాల గురించి వెతికారో తెలుసా? వాటి జాబితాను గూగుల్ అధికారికంగా విడుదల చేసింది. వివిధ కేటగిరీలుగా విభజిస్తూ ఎక్కువగా సర్చ్ చేసిన విషయాలను గూగుల్ విశదీకరించింది. అవేమిటో మీరూ తెలుసుకోండి.

ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ టెన్ అంశాలను పరిశీలిస్తే, ఇండియా-సౌత్ ఆఫ్రికా, క్యామెరాన్ బాయ్ సీ, కోపా అమెరికా, బంగ్లాదేశ్-ఇండియా, ఐ ఫోన్ 11, గేమ్ ఆప్ థ్రోన్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్, జోకర్, నాట్రె డామె, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టాప్ టెఅమెరికా, బంగ్లాదేశ్-ఇండియా, ఐ ఫోన్ 11, గేమ్ ఆప్ థ్రోన్స్, అవెంజర్న్ లో నిలిచాయి.

అదేవిధంగా వార్తల విషయానికి వస్తే కోపా అమెరికా, నాట్రె, డామె, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, హరికేన్ డొరెయిన్, శ్రీలంక, ఏరియా51, ఇండియా ఎలక్షన్ రిజల్ట్స్, ఫాల్ ఆఫ్ బెర్లిన్ వాల్ తో పాటు చైనా భాషలో గల మరో అంశాలు నెటిజన్ల సెర్చింగ్ లో టాప్ టెన్ లో నిలిచాయి.

పీపుల్ కేటగిరీలో ఆంటోనియా బ్రౌన్, నెయ్మర్, జేమ్స్ ఛార్లెస్, జుస్సీ స్మాల్లెట్, కెవిన్ హార్ట్, బిల్లీ ఇల్లీష్, గ్రిటా థన్ బెర్గ్, ఆర్. కెల్లీ, జాక్విన్ ఫోనిక్స్, జోర్డిన్ వుడ్స్ ల కోసం ఎక్కువగా వెతికారు.

యాక్టర్స్ కేటగిరీలో జుస్సీ స్మోల్లెట్, కెవిన్ హార్ట్, జాక్విన్ ఫోనిక్స్, కీను రీవెస్, లోరీ లాఫ్లిన్, లారెన్ లండన్, రామి మాలెక్, బ్రీ లార్సెన్ లతోపాటు మరో ఇద్దరు చైనా నటుల (అవి చైనా భాషలోనే ఉండడవం వల్ల పేర్లు తెలియలేదు) గురించి గూగుల్లో సర్చ్ చేశారు.

అథ్లెట్ల విభాగంలో ఆంటోనియా బ్రౌన్, నెయ్మర్, బ్రైసీ హార్పర్, డేవిడ్ ఆర్టిజ్, అలెక్స్ మార్గన్, ఆండ్రూ లక్, మెగన్ రెపినో, ఐకెర్ కాసిల్లాస్, జియాన్ విలియమ్ సన్, అన్సు ఫాటి గురించి గూగుల్ చేశారు.

సినిమాల విభాగంలో అవెంజర్స్ ఎండ్ గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్, టాయ్ స్టోరీ-4, ఆక్వామెన్, వన్స్ ఆపన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, ఫ్రోజెన్-2, గ్రీన్ బుక్, ది లయన్  కింగ్, అలాద్దీన్ చిత్రాలు టాప్ టెన్ సర్చింగ్ లో నిలిచాయి.

పాసింగ్స్ కు సంబంధించి కేమ్ రాన్ బాయ్ సీ, నిప్సే హస్సిల్, జులెన్, కార్ల్ లాగర్ ఫెల్డ్, ఎమిలియానో సలా, జెఫ్రీ ఎప్స్టీన్, గుగు లిబరాటో, నికి లాడా, గాబ్రియెల్ డినిజ్, సుష్మా స్వరాజ్ ల గురించి టాప్ టెన్ లో వెతికారు.

సంగీత విభాగంలో ఓల్డ్ టౌన్ రోడ్, 7 రింగ్స్, షాలో, సెనోరిటా, మెమరీస్, ఇన్ టూ ద అన్నోన్, ఎ వ్హోల్ న్యూ వరల్డ్, సన్ ఫ్లవర్, సెక్సీ లేడీ, బ్యాడ్ గయ్ పాటలు టాప్ టెన్ సర్చింగ్ లో ఉన్నాయి.

ఇక టీవీ షోలకు సంబంధించి గేమ్ ఆప్ థ్రోన్స్, స్ట్రాంగర్ థింగ్స్, ఛెర్నోబిల్, వెన్ దే సీ అజ్, ది అంబ్రిల్లా అకాడమీ, ది మాండలోరియన్, బల్బీర్, యుఫోరియా, మౌంటూ పతళ్లు, డెడ్ టూ మి టాప్ టెన్ లో ఉన్నాయి.

మన దేశంలో వెతికిన అంశాలు:

ప్రపంచ వ్యాప్తంగానే కాదు భారత దేశంలో ఎక్కువగా సర్చ్ చేసిన అంశాలను కూడా గూగుల్ ప్రకటించింది. ఓవరాల్ విభాగంలో క్రికెట్ వరల్డ్ కప్, లోక్ సభ ఎన్నికలు, చంద్రయాన్-2, కబీర్ సింగ్, అవెంజర్స్ ఎండ్ గేమ్, ఆర్టికల్ 370, నీట్ రిజల్ట్స్, జోకర్, కెప్టెన్ మార్వెల్, ప్రధాన మంత్రి కిసాన్ యోజన అంశాలు టాప్ టెన్ లో ఉన్నాయి.

వార్తలకు సంబంధించి లోక్ సభ ఎన్నికల ఫలితాలు, చంద్రయాన్-2, ఆర్టికల్ 370, పీఎం కిసాన్ యోజన, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పుల్వామా ఉగ్రదాడి, ఫణి తుపాన్, అయోధ్య తీర్పు, అమెజాన్ అడవుల్లో అగ్ని ప్రమాదపు అంశాలు టాప్ టెన్ లో ఉన్నాయి.

పర్సనాలిటీస్ విభాగంలో అభినందన్ వర్థమాన్, లతా మంగేష్కర్, యువరాజ్ సింగ్, ఆనంద్ కుమార్, విక్కీ కౌశల్, రిషబ్ పంత్, రాను మోందాల్, తారా సుతారియా, సిద్ధార్థ్ శుక్లా, కొయినా మిత్రాల గురించి టాప్ టెన్ లో వెతికారు.

కబీర్ సింగ్, అవెంజర్స్ ఎండ్ గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్, సూపర్ 30, మిషన్ మంగల్, గల్లీ బాయ్, వార్, హౌజ్ ఫుల్-4, యురి-ది సర్జికల్ స్ట్రయిక్ అనే సినిమాలను టాప్ టెన్ లలో గూగుల్ చేశారు.

ఇందుకు సంబంధించి గూగుల్ విడుదల చేసిన అఫీషియల్ వీడియో దిగువన చూడండి.

See what was trending in 2019

Comments are closed.

Exit mobile version