భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు వేధింపులకు గురవుతున్నారా? అయితే అందుకు కారకులెవరు? మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య అనుయాయులకు ఇక్కట్లు తప్పడం లేదా? కనకయ్య అనుచరులే లక్ష్యంగా అరాచక ‘రాజకీయం’ సాగుతోందా? వేధింపులను తాళలేక చివరికి కొందరు మనోవేదనతో గుండెలాగి ప్రాణాలు కోల్పోతున్నారా? ఇటువంటి అనేక ప్రశ్నలపై ఇల్లందు ప్రాంత ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
తాజాగా ఇల్లెందు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వీవీ రామారావు ‘గుండె’ ఆగి మరణించిన ఘటన తీవ్ర వివాదాస్పదమవుతోంది. నిన్న ఆకస్మికంగా మరణించిన వీవీ రామారావు గత నెల 22న ఇల్లెందు ఎమ్మెల్యే భర్త, ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మెన్ హరిసింగ్ నాయక్ కు రాసిన లేఖలో ఏయే అంశాలను ప్రస్తావించారు? క్లీనర్ నుంచి డ్రైవర్, ఆ తర్వాత లారీ ఓనర్స్ అసోసియేషన్ కు నాయకుడిగా ఎదిగి, ప్రతి ఒక్కరి తలలో నాలుకలా మారిన రామారావు అంతగా ఎందుకు కలత చెందారు? అసలేం జరిగింది? తన తండ్రి మరణానికి దారితీసిన పరిణామాలపై రామారావు భౌతికకాయం సాక్షిగా ఆమె కూతురు మాధురి ఏమంటున్నారో దిగువగల గల లేఖలో, వీడియోలో చదవవచ్చు, చూడవచ్చు.