• హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 8.52 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక హెలీకాప్టర్ లో కుటుంబ సమేతంగా యాదాద్రి బయలు దేరారు.

• ఉదయం 9.27 గంటలకు సీఎం కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు.

• ఉదయం 9:50 గంట‌ల‌కు ఆలయంలో కవచమూర్తులను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శోభాయాత్రను ప్రారంభించారు.

• ఉదయం 10 గంటలకు వీవీఐపీ అతిథి గృహం నుంచి సాంప్రదాయ వస్త్రాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆలయానికి చేరుకున్నారు.

• 10:05 గంట‌లకు బాలాలయంలోని తూర్పు ద్వారం గుండా కవచముల‌తో శోభాయాత్ర బయటకు రాగా, సీఎం కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు.

• 10:39 గంట‌ల‌కు ప్రధానాలయం తూర్పుకు రాజగోపురం ద్వారా ఉత్సవమూర్తులు ఆలయంలోకి ప్రవేశించారు.

• 10:50 గంటలకు ముఖమండపానికి ఉత్సవమూర్తులు చేరుకున్నారు.

• 11 గంట‌ల‌కు విమాన గోపురం, వివిధ రాజ గోపురాలపై అర్చకులు పూజలు ప్రారంభించారు.

• 11:40 గంట‌ల‌కు ప్రధానార్చకులు మహాసంకల్పాన్ని ప్రారంభించారు.

• 11:55 గంట‌ల‌కు దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం నిర్వ‌హించారు.

• సీఎం కేసీఆర్‌కు కంక‌ణ‌ధార‌ణ చేసి పండితులు ఆశీర్వ‌చ‌నం అందించారు. సప్త గోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు ఏక‌కాలంలో కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు.

• రాజ గోపురాల‌పై స్వ‌ర్ణ క‌ల‌శాల‌కు 92 మంది రుత్వికుల‌తో సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు.

• విమాన గోపురాల శిఖ‌రాల‌పై క‌ల‌శ సంప్రోక్ష‌ణ కైంక‌ర్యాలను వైభవంగా నిర్వ‌హించారు.

Comments are closed.

Exit mobile version