మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై సోషల్ మీడియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆయన ఇప్పటికే రెండుసార్లు పోలీసులను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఆయన గతంలో ఇచ్చిన ఫిర్యాదుల ప్రస్తుత స్థితి ఏమిటో తెలియదుగాని, మరోసారి తుమ్మల లక్ష్యంగా సోషల్ మీడియాలో పోస్టులు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఖమ్మం నగరంలో పాత బస్ స్టేషన్ పరిరక్షణ కమిటీ ఇటీవల తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి వినతి పత్రం సమర్పించిన పరిణామాల్లో, అదే ఘటనకు సంబంధించిన ఫొటోను జతచేస్తూ ఈ పోస్టులు సోషల్ మీడియాలో తిరుగుతుండడం గమనార్హం. ఇది మంత్రి అజయ్ కుమార్ అనుయాయుల చర్యగా తుమ్మల నాగేశ్వర్ రావు అభిమానులు ఆరోపిస్తున్నారు. తుమ్మలను మాత్రమే కాదు సీపీఎం నాయకులను కూడా టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆయా పోస్టును దిగువన ఉన్నది ఉన్నట్లుగానే చదవవచ్చు.

అద్దెల కోసం అద్దె లడాయి…!!
కిరాయి కోసం కొడవలి పట్టి సుత్తి మాటలు…!!
…………………………………………………………………………………………………..
నిఖార్సైన నాయకుడిపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్న బీద బుర్రలు..!!

పక్షంలో వుండి ప్రతిపక్షంతో అంటగాకి పాలేరు ఎన్నికల కోసం బస్టాండ్ అంశం పై “థూ” మల్ల డ్రామా..!!

నేను రాను బిడ్డో ఖమ్మం బస్డాండ్ కు అని సామాన్య జనం కుయ్యో మొర్రో అంటుంటే…!!

అద్దె మనుషులతో మిద్దెల అద్దె పోతదని భయపడిపోయి. వచ్చే ఆదాయం కాస్తా ఆగమైతదని సొంత లాభం, కొంత కూడా మానుకోకుండా.. అంత తమకే కావాలని.. ఎర్ర జెండా మాటున నల్లమనస్తత్వాలు కలిగిన మనుషుల హరికథ చెబుతా రారోండోయ్….!!

1970 లో ఖమ్మం పట్టణంగా కూడా సరిగా లేనప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లే వారికి సరైన బస్టాండ్ లేకపోవడంతో బస్సుల కోసం గంటల పాటు వేచి ఉండే పరిస్ధితి వుండేది. వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1975 లో 2.5 ఎకరాల స్ధల విస్తీర్ణంలో 12 ప్లాట్ ఫార్మ్ లతో బస్టాండ్ నిర్మాణం చేపట్టారు. అయితే 1978 లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బస్టాండ్ ను ప్రారంభించారు.
ఇప్పుడు ఖమ్మం పట్టణం నుంచి నగరంగా మారింది. 4 లక్షలకు పైగా జనాభా 60 డివిజన్లు.. ప్రతి రోజు 1400 ట్రిప్పులు తిరుగుతున్న బస్సులు. పలు రాష్ట్రాల నుంచి వచ్చి పోయే బస్సులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బస్టాండ్ వైపు ప్రయాణం అంటేనే ఓరి నాయనో .. అనే పరిస్థితి ఏర్పడ్డది.

రాజకీయా నాయకుడి కంటే ముందుగా ఖమ్మం నగర పౌరుడిగా బాధ్యతను ఎరిగిన పువ్వాడ అజయ్ కుమార్. అసెంబ్లీలో ఖమ్మం నగర ప్రజలు బస్టాండ్ తో ట్రాపిక్ తో పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా సమస్యను పరిష్కరిస్తే జీర్ణించుకోలేని కొన్ని సొంత పార్టీలోని వృధ్ద జంబుకాలు..

తమ ఊహల కొడవలి తో సుత్తి ఉద్యమాలు సృష్టించి. నిజమైన ప్రజ ఆదరణ వున్న బిడ్డను బద్నాం చేసే కుట్ర చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే ఈ పాత బస్టాండ్ పరిరక్షణ కమిటి పేరుతో జరుగుతున్న ఉద్యమంలో ప్రజలు పాల్గొన్న శాతం ఎంత.. ప్రజా బ్యాలెట్ లు నిర్వహించిన తీరు ఎలాంటిదో ప్రజలకు ఆ విషయం తెలుసు.
కొడవలితో కోసి ప్రజలనుంచి వసూలు చేసిన సుత్తి భవనాలు నిర్మించుకొని భారీ స్థాయిలో అద్దెలు వసూలు చేస్తున్న వారి జీవోనోపాధిపోతదనే భయంతో పాత బస్టాండ్ సమీపంలో వున్న వ్యాపారస్థుల పక్షాన పోరాడుతున్నామని సుత్తి బిల్డప్ లు ఇచ్చి.. సొంత లాభం కోసం పాటుపడుతున్నారనే విషయాన్ని గ్రహించిన స్థానిక ప్రజలు, వ్యాపారస్థులు పాత ఆలోచనలతో , బూజు పట్టిన పాత సిధ్దాంతాలతో , పాడుపడ్డ ఉద్యమాల ప్రజ మద్దతు అందుకే లేదనే విషయాన్ని గ్రహించాలని కోరుతున్నాం అధ్యక్ష…?

ఉద్యమం చేస్తే ఊరు కదలాలి…
పిడికిలి బిగిస్తే ప్రత్యర్ధి పరుగులంకించుకోవాలి…
నినదిస్తే నీలాకాశం రంగు మారాలి..!!

అది ప్రజాక్షేత్రంలో .. ప్రజల కోసం చేసే ఉద్యమాలకు ఉన్న పవర్.

పవర్ ఎలాగు లేదు … కనీసం పరువైన కాపాడుకోండి.
పసలేని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి మరింతగా పలుచనకాకండి.

జై.. తెలంగాణ ✊
జై.. కేసిఆర్ ✊
జై.. కేటిఆర్..✊
జై… అజయన్న …✊

Comments are closed.

Exit mobile version