ఏపీలోని ఓ ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడి చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు కొద్దిసేపటి క్రితం దాడి చేశారు. ద్వారకా తిరుమల మండలం జి. కొత్తపల్లిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల దాడిలో ఎమ్మెల్యే వెంకట్రావు తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామానికి చెందిన గంజి ప్రసాద్ అనే వైసీపీ కార్యకర్త ఈ ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.