బరాక్ ఒబామా అధ్యక్షుడిగా గెలుస్తే
తెలంగాణా ఆఫీసుల్లో
టపాసుల సంబరాలకు సోపతి ఏంది ..?
అర్థం కాని మతలబు ఏంది ?
ఆడ నల్లాయన ఎన్నికకు
మన దగ్గరున్న కుల వివక్షతకు బంధం ఏంది ?
కుహనా మేధావుల సందడేంది ?
వాడు ప్రపంచ బ్యాంకును కాదంటాడా ?
అమెరికా దోపిడీని అడ్డుకుంటాడా,
ఆయుధాల వ్యాపారం ఆపుచేస్తాడా,
దోచుకుని దాచుకున్నదంతా పంచిపెడ్తడా ?
తనవల్లే గెలుపు సాధ్యమయ్యిందంటడు
అనుభవమున్న చంద్రబాబు,
ఆంజనేయుడి మాల ధరించినందుకే
నల్ల ముత్యంతో శ్వేత సౌధం
మెరిసిందంటడు సినిమా బాబు.
వీళ్ళకంటే సోయిలేదు
సొల్లు వాగుడాపలేరు
మేధావులకేం పుట్టింది
ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ?
ఆ నల్లనయ్య కంటిచూపుతో
ప్రపంచాన్ని మారుస్తాడని
మన బిజినెస్ మీడియా తెగ కక్కుతోంది.
వారి భార్య వేసుకున్న
డ్రెస్ ఆమె గారికి నప్పలేదని
ఇంకో రంగం వాపోతోంది.
అక్కడి అధ్యక్షుడు
తెల్లోడైనా నల్లోడైనా
ఫరక్ ఏం పడ్తది
ప్రపంచానికి ఏమి వొరుగుతుంది ?
మౌంట్ బాటెన్ పోయి
నెహ్రు వస్తే దోపిడీ ఆగిందా,
చెప్పినట్లు ఇంటనంటే
సోనియా బాబును
ముఖ్యమంత్రిని చేయదా ?
అద్వానీ అసదుద్దీన్ ను
కౌగలించుకోడా ?
సమైక్య వాదులతో కేసీఆర్ అంటకాగడా ?
వాళ్ళ ఆధిపత్యానికి
కొరగాడనుకుంటే ……..
అమెరికన్లు
నిగ్గర్ను గెలిపిస్తరా ?
సద్దామును సమాధి చేస్తరా … ?
✍️ అర్వపల్లి విద్యాసాగర్, ఖమ్మం
(ఒబామా గెలిచినప్పుడు రాసుకున్న కవిత. చాలా కాలం కిందది ఇది. ఇప్పటికీ అంతే. పరిస్థితుల్లో తేడా ఏమీ ఉండదు. అంతా వ్యాపారమే )