హోరు గాలి… జోరు వాన… కళ్ల ముందే నీళ్లల్లో తడుస్తున్న ఆరుగాలపు కష్టం. కర్షకునికి కంట కన్నీళ్లు మిగిల్చిన నష్టం. ఓ వైపు వేగంగా వీస్తున్న గాలికి లేస్తున్న టార్బాలిన్లు… మరోవైపు వర్షానికి నీటిలో కలిసిపోతున్న వరి ధాన్యం. వీటి నుంచి పండించిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి కర్షకుడు పడుతున్న యాతన. కళ్లముందు సాక్షాత్కరిస్తున్న రైతన్న పాట్లు. ఇది ఎంతగా వర్ణించినా, మరెంతగా చెప్పినా తీరని వేదన.

మంగళవారం కురిసిన అకాల వర్షానికి తెలంగాణాలోని పలు ప్రాంతాల్లోని ఐకేపీ కేంద్రాల్లో కర్షకుని కష్టం వర్షార్ఫణమైంది. ప్రతిరోజూ కడుపారా అన్నం తింటున్న వాళ్లు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ముఖ్యంగా తాలు, తేమ పేరుతో రైతాంగాన్ని దోపిడీ చేస్తున్న మిల్లర్లు కళ్లారా చూడాల్సిన అంశమిది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లిలోని ఐకేపీ కేంద్రంలో అకాల వర్షం నుంచి వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు పడుతున్న పాట్లకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఇక వీడియో చూడండి.

Comments are closed.

Exit mobile version