ఛత్తీస్ గఢ్ పేరు వినగానే తుపాకీ కాల్పుల ఘటనలు గుర్తుకు రావడం సహజం. ఆ రాష్ట్రంలో పోలీసులు, నక్సల్స్ మధ్య నిత్యం జరిగే భీకర పోరు ఇందుకు కారణం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వర్షపు వీడియో ఒకటి అచ్చు తుపాకీ కాల్పుల మోతను తలపించే విధంగా కనిపిస్తుండడం విశేషం. తెలంగాణాలోని పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యపు రాశులు ఐకేపీ కేంద్రాల్లోనే తడిసి ముద్దయ్యాయి.

ఈ నేపథ్యంలోనే పొరుగున గల ఛత్తీస్ గఢ్ లో దాదాపు ఒకటి నుంచి రెండు కిలోల బరువు గల వడగళ్ల వర్షం కురిసినట్లు వార్తలు వస్తున్నాయి. కిలోల కొద్దీ బరువు గల వడగళ్ల కారణంగా కార్లు ధ్వంసమయ్యాయి. ఇంటి పైకప్పులుగా ఏర్పాటు చేసుకున్న సిమెంట్ రేకులు ఆనవాళ్లు కోల్పోయాయి. అయితే ఈ వర్షం ఛత్తీస్ గఢ్ లో ఎప్పుడు కురిసిందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఆయా దృశ్యాలను, వీడియోను ఇక్కడ చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version