తెలంగాణా ఆర్టీసీ ప్రయాణీకులపై మెరుపు బాదుడుకు దిగింది. అనూహ్యంగా ఛార్జీలను పెంచింది. ప్యాసింజర్ సెస్సు పేరుతో ఈ ఛార్జీలను పెంచడం గమనార్హం. ముఖ్యంగా ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ. 5.00 చొప్పున, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ. 10.00 మేరకు రేట్లు పెంచారు. పెంచిన ఛార్ఝీలు వెంటనే అమల్లోకి వస్తాయని టీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

మరోవైపు చిల్లర సమస్య కారణంగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లను ఇటీవలే రౌండప్ చేసిన సంగతి తెలిసిందే. పల్లె వెలుగు బస్సుల్లో ఈ రౌండప్ రేట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదాహరణకు రూ. 12 టికెట్ ధర ఉన్న మార్గంలో రూ. 10కి, రూ. 13, రూ. 14 టికెట్ రేటు గల మార్గాల్లో రూ. 15 గా రౌండప్ చేశారు. ఈ పరిణామాల్లోనే తాజాగా ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

Comments are closed.

Exit mobile version