టీఆర్ఎస్ లీడర్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుమారుని వివాహ వేడుక సందర్భంగా ఓ సినిమా పాటకు కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ చేశారు. అబుదాబిలో కుమారుని పెళ్లి ఇటీవల జరగగా, మార్చి 1న ఖమ్మంలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలోని ఓ పాటకు పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన సోదరుడు ప్రసాదరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు కలిసి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చిత్రీకరణ అబుదాబిలో జరిగిందా? లేక హైదరాబాద్ లోని తన నివాసంలోనా? అనే విషయంపై స్పష్టత లేదు. వీడియోలో పెంపుడు కుక్క ఒకటి వెడుతున్న సీన్ చూస్తుంటే మాత్రం బహుషా హైదరాబాద్ లోనే వీడియో చిత్రీకరణ జరిగి ఉండవచ్చని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు. ‘పొంగులేటి’ బ్రదర్స్ సతీసమేతంగా చేసిన డాన్స్ వీడియోను దిగువన చూడండి.

Comments are closed.

Exit mobile version