మీరు చూస్తున్న ఈ ఫొటోలోని దృశ్యం బాహుబలి సినిమా సెట్టింగ్ బాపతు కాదు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుని వివాహం ఇటీవల అబుదాబిలో జరిగింది. ఈ పెళ్లి వేడుక సందర్భంగా ‘పొంగులేటి’ బ్రదర్స్ చేసిన డాన్స్ సందడిని ఇంతకు ముందు పోస్టు వీడియోలో చూశారు కదా? పొంగులేటి తన కుమారుని వివాహమైతే దుబాయ్ లో చేశారుగాని, తన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పెళ్లి భోజనం ఏర్పాట్లను మాత్రం ఖమ్మంలో చేస్తున్నారు. ఈమేరకు ఆదివారం భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

ఖమ్మం శివార్లలో బాహుబలి సినిమా తరహా సెట్టింగులతో పెద్ద ఎత్తున రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నుంచేగాక పరిసర జిల్లాల నుంచి దాదాపు రెండు లక్షల మంది ఈ రిసెప్షన్ కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈమేరకు రిసెప్షన్ కు హాజరయ్యే వారి కోసం భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా సెట్టింగులను తలపించే విధంగా చేస్తున్న డెకరేషన్ కు సంబంధించి పొంగులేటి అనుచరులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రిసెప్షన్ ఏర్పాట్ల సందర్భంగా డెకరేషన్ తదితర ఏర్పాట్లకు సంబంధించి మాజీ ఎంపీ అభిమానులు ‘పొంగులేటి సామ్రాజ్యం’ పేరుతో బాహుబలి సినిమా పాటతో చేసిన మిక్సింగ్ వీడియోను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version