మావోయిస్టు పార్టీ అగ్రనేత ఒకరు కరోనా బారిన పడి మరణించారు. ఆ పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ మోహన్ అలియాస్ శోబ్రాయ్ కి కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. చికిత్స కోసం హన్మకొండ ఆసుపత్రికి వస్తుండగా ఈనెల 2వ తేదీన తనిఖీల్లో మధుకర్ తోపాటు మైనర్ కొరియర్ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. మధుకర్ కు పోలీసులు తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స జరిపించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించామని, చికిత్స పొందుతూనే మధుకర్ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు పోలీసులు తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కొండపల్లికి చెందిన మధుకర్ రెండు దశాబ్ధాల క్రితం మావోయిస్టు పార్టీలో చేరారు. అతనిపై రూ. 8.00 లక్షల రివార్డు కూడా ఉందని, మధుకర్ కరోనాతో చనిపోయిన విషయాన్ని ఆయన కుటుంబీకులకు సమాచారం అందించినట్లు వరంగల్ పోలీసు వర్గాలు చెప్పాయి.

ఫొటో: మధుకర్

Comments are closed.

Exit mobile version