నల్లజాతీయులపై తెల్లజాతీయులైన పోలీసుల దాష్టీకానికి నిరసనలతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్రో-అమెరికన్ జార్జి అఫ్లాయిడ్ మృతికి నిరసనగా ప్రజల ఆగ్రహ జ్వాలలు అమెరికా ఖండాంతరాలు దాటి మరీ వ్యాప్తిస్తున్నాయి కూడా. ఇదే దశలో నిరసన పర్వంలో లూటీలు కూడా చోటు చేసుకోవడం గమనార్హం. జార్జి ఫ్లాయిడ్ ఘటన విషాదమే అయినప్పటికీ, నిరసన మాటున లూటీ ఉదంతాలు ప్రజల్లో మరింత ఆందోళనకు కారణమయ్యాయి.
అనేక మంది ఆందోళనకారులు యధేచ్ఛగా పలు ప్రాంతాల్లో లూటీకి తెగబడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక, వ్యాపార సంస్థల్లో చొరబడి దోపిడీకి దిగుతున్నారు. అట్లాంటాలోని ఓ షాపింగ్ మాల్, వాషింగ్టన్ లోని కేపిటల్ బ్యాంకు తదితర సంస్థల్లో దుండగులు చొరబడి దోచుకున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఇటువంటి లూటీ పర్వాన్ని ఉపేక్షించేది లేదని బంకర్ నుంచి బయటకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్నారు.
అట్లాంటాలోని షాపింగ్ మాల్ లో లూటీ పర్వాన్ని దిగువన గల వీడియోలో చూడవచ్చు.