తెలంగాణాలో తొలి యూకే కరోనా వైరస్ కేసు నమోదైందా? సుమారు ఇరవై రోజుల క్రితం యూకే నుంచి వరంగల్ కు వచ్చిన ఓ వ్యక్తికి కొత్తరకం కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఓ 49 ఏళ్ల వ్యక్తికి యూకే వైరస్ సోకినట్లు సీసీఎంబీ నిర్ధారించిందనేది ఆయా వార్తల సారాంశం. ఈనెల 16వ తేదీన అతనికి కోవిడ్ లక్షణాలు కనిపించగా, 22న జరిపిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం సేకరించిన శాంపిళ్ల ద్వారా అతనికి యూకే వైరస్ సోకినట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఆయా బాధితుని తల్లికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగినట్లు సమాచారం. కానీ, బాధితుని తల్లి మినహా ఇతర కుటుంబ సభ్యులకు జరిపిన వైద్య పరీక్షల్లో మాత్రం నెగిటివ్ రిజల్ట్ రావడం గమనార్హం. వరంగల్ జిల్లాకు చెందిన ఈ వ్యక్తికి యూకే వైరస్ సోకిందనే అంశాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

Comments are closed.

Exit mobile version