ఓరుగల్లు మహానగరాన్ని హెల్త్ సిటీగా రూపుదిద్దేందుకు తెలంగాణా ప్రభుత్వం కీలక ఉత్తర్వును జారీ చేసింది. ప్రక్రియలో భాగంగా జీవోఎంఎస్ నెం.158ను ప్రభుత్వం జారీ చేసింది. పదిహేను ఎకరాల్లో రూ. 1,100 కోట్లతో నిర్మాణాలకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వును వెలువరించింది. మొత్తం 24 ఫ్లోర్లతో భారీ భనవ సముదాయం, 2,000 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. సూపర్ స్పెషాలిటీల కోసం 800 పడకలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

● వరంగల్ ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నహాలు చేస్తోంది.
● పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో వరంగల్ లో ప్రభుత్వం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించింది.
● అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడిన ఈ హెల్త్ సిటీ నిర్మాణాన్ని ప్రభుత్వం మొత్తం 215.35 ఎకరాల్లో నిర్మాణం జరగనుంది.
● అందులో 15 ఎకరాల్లో 1,100 కోట్లతో నిర్మాణాలకు అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.
● 24 ఫ్లోర్లతో బారీ భనవ సముదాయంతో మొత్తం 2,000 పడకల సామర్థ్యం తో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనున్నది.
● స్పెషాలిటీ వైద్యం కోసం 1,200 పడకలు. ఇందులో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ENT, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ మొదలైనవి ఉంటాయి.
● సూపర్ స్పెషాలిటీల కోసం 800 పడకలు వీటిలో ఆంకాలజి సహా న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి విభాగాలు ఉంటాయి.
● కిడ్నీ, కాలేయం వంటి అవయవ మార్పిడికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. కీమోథెరపీ మరియు రేడియేషన్ సౌకర్యాలతో అత్యాధునిక క్యాన్సర్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
● డెంటల్ కళాశాలను ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయనున్నారు.

● హెల్త్ సిటీలో…
○ వైద్య విద్య కొరకు వైద్య కళాశాల, డెంటల్ కళాశాలలు
○ వైద్య విద్య కొరకు ప్రత్యేక ఆరోగ్య విశ్వ విద్యాలయం ( కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం)
○ వైద్య సేవలకొరకు 2,000 పడకల మల్టీ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి దీనిలో సాధారణ సేవలైన మెడిసిన్, సర్జరీలతో పాటు సూపర్ స్పెషలిటీ సేవలైన గుండె , కిడ్నీ , కాన్సర్ సేవలు అందించడం జరుగుతుంది.
○ డాక్టర్స్ , వైద్య విద్యార్థులు , వైద్య సిబ్బంది కొరకు వసతి
○ రోగులకు వారి సహాయకులకు ప్రత్యేక వసతి

Comments are closed.

Exit mobile version