మేడారం జాతర. అడవి తల్లి ఒడిలో, ఆకాశం కప్పు కింద కోటి మందికి పైగా భక్తులు సేద తీరే అపూర్వ దృశ్యం. తన జాతి రక్షణ కోసం కాకతీయ ప్రతాపరుద్రునిపైనే కరవాలం ఝుళిపించిన వీర వనితల సాహస చరిత్రకు ప్రతి రూపం ఈ భక్తుల సందడి. ఆదివాసీ బిడ్డల ఆరాధ్య దైవం ఇప్పుడు అందరి దేవతలు. విదేశీయుల సందడి కూడా ప్రతి జాతరలో సాధారణమే. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఈసారి వచ్చే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర గురించి తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. దిగువన వీక్షించండి.

Comments are closed.

Exit mobile version