ఐపీఎస్ అధికారి తఫ్సీర్ ఇక్బాల్ ను తెలంగాాణా ప్రభుత్వం కీలక బాధ్యతల్లో నియమించింది. సీఎం సెక్యూరిటీ వింగ్ డీఐజీగా తఫ్సీర్ ఇక్బాల్ కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఆయన విధుల్లో చేరినట్లు కూడా సమాచారం. గత ఏప్రిల్ మొదటి వారం వరకు తఫ్సీర్ ఇక్బాల్ ఖమ్మం పోలీస్ కమిషనర్ గా పనిచేశారు.
నాలుగేళ్ల పాటు అంటే 2017 ఏప్రిల్ 3వ తేదీ నుంచి గత ఏప్రిల్ 5వ తేదీ వరకు తఫ్సీర్ ఖమ్మం పోలీస్ కమిషనర్ గా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన అనేక ముఖ్య ఘటనల్లో తఫ్సీర్ వేగంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకున్నారు. మూడు నెలలకు పైగా పోస్టింగ్ లేకుండా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్ ను ప్రభుత్వం కీలకమైన సీఎం సెక్యూరిటీ వింగ్ డీఐజీ గా నియమించడం విశేషం.