పాఠశాలలను ప్రారంభించే అంశంపై తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ నివేదికను కూడా తెప్పించుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు ఉటంకిస్తున్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణాలో ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకు పాఠశాలలు ప్రారంభించలేదు. ప్రయివేట్ పాఠశాలలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తుండగా, ప్రభుత్వ పాఠశాల్లో టెన్త్ క్లాసు విద్యార్థులకు సందేహాలు తీరుస్తూ, టీవీల్లో పాఠాలు బోధిస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్ నేపథ్యంలో పాఠశాలను ప్రారంభిచేందుకు ప్రభుత్వం సిద్ధపడినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడవచ్చని భావిస్తున్నారు. అయితే దాదాపు మరో నాలుగు నెలల్లోనే విద్యా సంవత్సరం ముగుస్తుండగా, ప్రభుత్వం ఇప్పుడు స్కూళ్లను తెరిస్తే విద్యాసంవత్సరం ‘లెక్క’ మారే అవకాశం ఉందంటున్నారు.

Comments are closed.

Exit mobile version