తెలంగాణా సీఎం కేసీఆర్ శుక్రవారం మేడారం రానున్నారు. దాదాపు మూడు గంటల సేపు సీఎం మేడారంలోనే గడుపుతారు. పగలు పన్నెండు గంటలకల్లా మేడారానికి సీఎం చేరకోనున్నారు. తన ఎత్తు బంగారం (బెల్లం)తో మొక్కులు చెల్లించి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి హైదరాబాద్ వెడతారు.
అదేవిధంగా మరికొందరు ప్రముఖులు కూడా ఈరోజు మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతల దర్శనం చేసుకోనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు శుక్రవారం మేడారం రానున్నారు. గద్దెలపై కొలువై ఉన్న వనదేవతలు శనివారం తిరిగి వన ప్రవేశం చేయనున్నారు.
ఫొటో: గురువారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో మేడారం