పోడు భూముల అంశంపై కేబినెట్ సబ్ కమిటీ శనివారం సమావేశమైంది. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం వెతికే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు బూర్గుల రామకృష్ణారావు (BRKR) భవన్ లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది.

రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలతో వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మూడో సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా, అటవీ శాఖ పిసిసీఎఫ్ శ్రీమతి శోభ ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫొటో: గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

Comments are closed.

Exit mobile version