ప్రపంచాన్ని, ప్రస్తుతం మన దేశాన్ని కూడా తీవ్రంగా వణికిస్తున్న కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే చెప్పారనే సోషల్ మీడియా పోస్టును కొన్ని రోజులుగా చూస్తున్న సంగతి తెలిసిందే. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి, లక్షలాది మంది చనిపోతారని, ‘కోరంకి’ (కరోనా?) అనే జబ్బు కోటి మందిని కబలించి కోడిలాడ తూగి చనిపోతారని బ్రహ్మంగారు చెప్పినట్లు పేర్కొంటున్న కాలజ్ఞానపు సోషల్ మీడియా పోస్టు సారాంశం. మన బ్రహ్మంగారు చెబితే… ఔనా? నిజమా? అని ఆశ్చర్యపోతామే తప్ప పూర్తిగా నమ్మం కదా!

కానీ అచ్చం బ్రహ్మంగారి కాలజ్ఞానం తరహాలోనే ఓ ఇద్దరు ఇంగ్లీష్ రచయితలు కూడా కరోనా వైరస్ గురించి ముందుగానే హెచ్చరించినట్లు ఓ పుస్తకంలోని వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి. ‘లిండ్సే హ్యారిసన్’ తో కలిసి సిల్వియా బ్రౌనీ అనే ఆంగ్ల రచయిత ‘ఎండ్ ఆఫ్ డేస్’ అనే శీర్షికతో ఓ పుస్తకాన్ని రాశారు. న్యూయార్క్ టైమ్స్ ఈ పుస్తక ప్రతులను విక్రయిస్తోంది.

న్యుమోనియా వంటి అనారోగ్య వ్యాధి సుమారు 2020లో వ్యాపిస్తుందని, ఊపిరిత్తులపై, శ్వాసనాళాలపై తీవ్రంగా దాడి చేస్తుందని, అన్ని రకాల వైద్య చికిత్సలను ఇది నిరోధిస్తుందని రచయిత తన పుస్తకంలో ఉటంకించారు. అయితే వ్యాపించిన వెంటనే ఈ వ్యాధి కనుమరుగవుతుందని, కానీ పదేళ్ల తర్వాత మళ్లీ దాడి చేస్తుందని, అనంతరం పూర్తిగా మాయమవుతుందని పుస్తక రచయిత పేర్కొనడం విశేషం.

పుస్తకంలోని 312వ పేజీలో ఈ విషయం స్పష్టంగా ఉండగా, అదే పేజీలో పైన గల మరో పేరాలో ఇంకో వ్యాధి గురించి కూడా ప్రస్తావించడం గమనార్హం. మాంసాహారం భుజించడం వల్ల 2010లో బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ వస్తాయనే విషయాన్ని రాశారు. బహుషా ‘స్వైన్ ఫ్లూ’ గురించి కాబోలునని పుస్తకంలోని ఆయా అంశం గురించి చదివినవారు భావిస్తున్నారు. పన్నెండేళ్ల క్రితమే రచయిత బ్రౌనీ ఈ పుస్తకాన్ని వెలువరించగా, 2013లో ఆమె మరణించినట్లు వార్తలు వచ్చాయి.

Comments are closed.

Exit mobile version