తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం ప్రారంభ‌మైంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జ‌రుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు హాజర‌య్యారు.

ఈ సందర్భంగా సమావేశంలో వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగం పక్షాన చేయాల్సిన పోరాటాలు, నిరసనలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలు నిరసనలు, ఆందోళన చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో బట్టబయలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి సూచించారు.

Comments are closed.

Exit mobile version