కరోనా మహమ్మారి ఓ ఎస్పీని బలి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటర్ ఇంటలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న రామ్ ప్రసాద్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడ్డ ఎస్పీ రామ్ ప్రసాద్ గడచిన పది రోజులుగా చికిత్స పొందుతూనే గురువారం తుదిశ్వాస విడిచారు. రామ్ ప్రసాద్ గతంలో మహబూబాబాద్ డీఎస్పీగా, విజయవాడ ట్రాఫిక్ అదనపు డీసీపీగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీలో కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగంలో నాన్ కేడర్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా తన బ్యాచ్ మేట్ రామ్ ప్రసాద్ కరోనాతో పోరాటం చేసి కొద్ది గంటల క్రితమే అమరుడయ్యారని మానుకోట ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు.