తనపై ఖమ్మం జిల్లాలోని ఓ కోర్టులో పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ దళిత మహిళా న్యాయవాది చేసిన ఫిర్యాదు తీవ్ర కలకలం రేపుతోంది. ఎస్సీ వర్గానికి చెందిన మహిళా న్యాయవాది అయిన తనపై ఖమ్మం జిల్లాలోని ఓ కోర్టులో ప్రభుత్వం ద్వారా నియమితుడై, పనిచేస్తున్న పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) శారీరక, మానసిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. ఈమేరకు అమె ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ ఫోరంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే ఫిర్యాదు ప్రతులను బాధితురాలు రాష్ట్ర గవర్నర్ కు, ముఖ్యమంత్రికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ కు, ఖమ్మం జిల్లా జడ్జికి, డీజీపీకి, ఖమ్మం పోలీస్ కమిషనర్ కు, ఖమ్మం జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు, ఖమ్మం బార్ అసోసియేష్ అధ్యక్షునికి, జాతీయ ఎస్సీ కమిషన్ కు, ఖమ్మం అర్బన్ పోలీసులకు పంపినట్లు తెలిసింది.

ఖమ్మంలోని ఓ కోర్టులో ప్రభుత్వం ద్వారా నియమితుడై, పనిచేస్తున్న పీపీ వద్ద తాను సాంఘిక సంక్షేమ సంఘం ద్వారా ఖమ్మం కలెక్టర్ ఉత్తర్వుతో జూనియర్ న్యాయవాదిగా నియమితురాలైన బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు. తనను శారీరకంగా అనుభవించాలనే కాంక్షతో అనేకసార్లు లైంగికంగా వేధించడమేగాక, పలు దాష్టీకాలకు ప్రభుత్వంతో నియమితులైన పబ్లిక ప్రాసిక్యూటర్ పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. ఇతని లైంగిక వేధింపుల ఆరోపణల అంశంలో ప్రభుత్వం ద్వారా నియమితులైన మరో ఇద్దరు పీపీలపై కూడా అమె పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 10వ తేదీన బాధితురాలు చేసినట్లు తెలుస్తున్న ఫిర్యాదుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

(అసలేం జరిగింది…? తర్వాత కథనంలో…)

Comments are closed.

Exit mobile version