జర్నలిస్టులపై దాడులు కొత్త కాదు. ఏ రాజకీయ నాయకుడో, గూండానో, రౌడీనో, ఇతరత్రా చిల్లర మల్లర గాళ్లో దాడులు చేయడం అనేక ఘటనల్లో చూశాం. నిబద్ధతతో విధులు నిర్వర్తించే జర్నలిస్టులు అనేక మంది ఇటువంటి చేదు అనుభవాలను చవి చూసినవారే.
కానీ ఓ సీనియర్ జర్నలిస్టే మరో వీడియో జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఆయనను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? జర్నలిజంలో ఎంతో సీనియర్లమని చెప్పుకునేవారే సంయమనం కోల్పోతే ఏ విధంగా భావించాలి? ఇదీ అసలు ప్రశ్న.
విషయమేమిటంటే… పాశం యాదగిరి తెలుసుగా…? తెలుగు మీడియాలో సీనియర్ జర్నలిస్టు. ప్రొఫెషనల్ జర్నలిస్టుగానే పేరుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తెలంగాాణా ఉద్యమ చరిత్ర కూడా యాదగిరికి ఉంది.
అంతటి సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి బీజేపీ ఆఫీసుకు వచ్చారు. ఎందుకంటే యాదగిరి బంధువు పాశం శకుంతలకు గోల్కొండ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ సందర్భంగా బీ ఫారం తీసుకునేందుకు పాశం యాదగిరి కూడా బీజేపీ ఆఫీసుకు వచ్చారు.
ఇదే సమయంలో అక్కడే గల ఓ న్యూస్ ఛానల్ వీడియో జర్నలిస్టు కనకరాజు తన భుజంపై గల కెమెరాతో వీడియో తీస్తున్నాడు. ఇదే కనకరాజు చేసిన తప్పు. అందుకు పాశం యాదగిరి ఏ విధంగా స్పందించారో దిగువన గల వీడియోను చూసి మీరే చెప్పండి.