భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగనేనిప్రోలు సర్పంచ్ బి. శ్రావణి సస్పెండయ్యారు. పంచాయత్ రాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్ శ్రావణిని పదవి నుంచి తాత్కలికంగా మూడు నెలలపాటు తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ఉత్తర్వు కూడా జారీ చేశారు.

నాగినేనిప్రోలు సర్పంచ్ శ్రావణి, ఉప సర్పంచ్ ఝాన్సీ లక్ష్మిబాయి, వారి భర్తలు శివక్రిష్ణ, శివారెడ్డిలు కలిసి రూ. 1.27 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారులు తమ విచారణలో తేల్చారు. ఇదే అంశంపై ts29 ఈ ఉదయం సమగ్ర వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.

నిధుల దుర్వినియోగానికి సంబంధించి సర్పంచ్ శ్రావణి ఇచ్చిన సంజాయిషీ సంతృప్తికరంగా లేదని, తెలంగాణా పంచాయతీరాజ్ చట్టం 2018లోని నియమ, నిబంధనలను ఆమె ఉల్లంఘించారని కలెక్టర్ పేర్కొన్నారు అందువల్ల సర్పంచ్ పదవి నుంచి శ్రావణిని గరిష్టంగా మూడు నెలలపాటు తొలగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వు (ఆర్ సీ నెం. పి1/896/2021)లో వివరించారు.

Comments are closed.

Exit mobile version