మేడారం జాతరలో అద్భుత ఘట్టం బుధవారం రాత్రి పొద్దుపోయాక ఆవిష్కృతమైంది. మేడారానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గ్రామంలో కొలువై ఉన్న సారక్కను బుధవారం సాయంత్రం అత్యంత సంబురం మధ్య పూజారులు తీసుకువచ్చారు.
డోలు, డప్పు, మేళ, తాళాలతో భారీ ఊరేగింపు మధ్య… లక్షలాది మంది భక్తులు అనుసరించగా అత్యంత కోలాహల సందడి మధ్య సారక్కను మేడారానికి ఆహ్వానించారు. తండ్రి పగిడిద్దరాజు, సోదరుడు జంపన్న వేచి చూస్తుండగా సారక్క జంపన్నవాగు వద్ద వారితో కలిసి తనకోసం అలంకరించి సిద్ధంగా ఉంచిన మేడారం గద్దెవైపు పయనం సాగించారు.
రాత్రి 7.08 గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారక్క మేడారం చేరుకునేసరికి రాత్రి 10.47 గంటలైందంటే ఆమె రాకకోసం భక్తుల కోలాహలాన్ని, సందడిని అవగతం చేసుకోవచ్చు. బుధవారం రాత్రి పొద్దుపోయాక గద్దెను అధిష్టించిన సారక్క రాక దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.