Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»అసోం సీఎంపై కేసు… రేవంత్ హౌజ్ అరెస్ట్

    అసోం సీఎంపై కేసు… రేవంత్ హౌజ్ అరెస్ట్

    February 16, 20221 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 assam cm

    అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

    మరోవైపు టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అసోం సీఎంపై క్రిమినల్ కేసు నమోదు చేయనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల ముందు నిరసనలు నిర్వహించాలని పార్టీ కోరింది. ఈ మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఇళ్ల నుంచి బయటకు రాకముందే హౌజ్ అరెస్ట్ చేశారు.

    హైదరాబాద్ కమిషనరేట్ దగ్గర నిరసనకు బయలుదేరడానికి ముందే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రి నుంచే రేవంత్ ఇంటి దగ్గర పోలీసు బలగాలను మొహరించారు. అలాగే రాచకొండ కమిషనరేట్ దగ్గర నిరసనలో పాల్గొంటానని ప్రకటించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కూడా గృహ నిర్బంధం చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ నేతలందరినీ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    తనను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయడాన్ని రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఆయా ట్వీట్ ను దిగువన చూడవచ్చు.

    How many times will you repeat this KCR…?!

    Instead of filing cases on our complaints on Assam CM @himantabiswa …why arrest Congress leaders and cadre…?!

    We totally understand your fear of losing power…#ByeByeKCR #HataoAssamCM pic.twitter.com/hU8r8USpW3

    — Revanth Reddy (@revanth_anumula) February 16, 2022
    assam cm revanth reddy Telangana police అసోం సీఎం తెలంగాణా పోలీస్ రేవంత్ రెడ్డి
    Previous Articleబప్పీలహిరి కన్నుమూత
    Next Article గద్దెనెక్కిన సారక్క

    Related Posts

    పోలీసులకు చుట్టుకున్న ‘ఎన్కౌంటర్’: హత్య కేసు నమోదుకు సిఫారసు

    May 20, 2022

    ఖమ్మం పోలీసుల ‘ఇజ్జత్ కా సవాల్’

    May 6, 2022

    జర్నలిస్ట్ సంఘ నేతకు ఖమ్మం పోలీసుల షాక్!

    May 3, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.