తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా అధిపతులతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగానే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను రేవంత్ శనివారం కలుసుకున్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఓ తెలుగు న్యూస్ ఛానల్ చైర్మెన్ తో కూడా భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారానికి ముందే రేవంత్ రెడ్డి మీడియా అధిపతులను కలిసి సమావేశమవుతుండడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పత్రికగాని, ఛానల్ గాని ప్రత్యేకంగా లేని పరిణామాల్లో రేవంత్ మీడియా సంస్థల యజమానులను కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.