ఔను… మేడారం జాతరకు ఈసారి కూడా ట్రస్టు బోర్డు లేదు. మరోసారి పునరుద్ధరణ కమిటీనే ఏర్పాటు చేశారు. మొత్తం 14 మంది సభ్యులతో పునరుద్ధరణ కమిటీ వైపే ప్రభుత్వం మొగ్గు చూపడం విశేషం. వచ్చే నెల 16వ తేదీ నుంచి19వ తేదీ వరకు జరిగే మేడారం జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం ఈ పునరుద్ధరణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈనెల 29వ తేదీన దేవాదాయ శాఖ మంత్రి సమక్షంలో సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు.
మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ సభ్యులుగా నియమితులైనవారిలో కొర్నిబెల్లి శివయ్య, సప్పిడి వెంకట రామనర్సయ్య, చిలకమర్రి రాజేందర్, లకావత్ చందూలాల్, వట్టం నాగరాజు, బండి వీరస్వామి, సానికొమ్ము ఆదిరెడ్డి, నక్కా సాంబయ్య, జేటీవీ సత్యనారాయణ, తండా రమేష్, పొదెం శోభన్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణస్వామి, సిద్ధబోయిన జగ్గారావులు ఉన్నారు. వీరిలో కొర్నిబెల్లి శివయ్య పునరుద్ధరణ కమిటీ చైర్మెన్ గా నియమితులయ్యే అవకాశం ఉంది. ట్రస్టు బోర్డు ఊసే లేని పునరుద్ధరణ కమిటీ గురించి రెండేళ్ల క్రితంనాటి జాతర -2020 సందర్భంగా ts29.in రాసిన వార్తా కథనం మరోసారి మీకోసం దిగువన…