మొన్న జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ తాజాగా దేశ ప్రజలకు మరో సందేశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు బంద్ చేసి, టార్చ్ లైట్లు, సెల్ ఫోన్ లైట్లు, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని దేశ ప్రజలను కోరిన సంగతి తెలిసిందే. ఈమేరకు ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్ధేశించి ఈరోజు ఉదయం వీడియో సందేశాన్ని ఇచ్చిన విషయమూ విదితమే. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు భారతీయులు లైట్లు బంద్ చేసి తమ సంకల్ప బలాన్ని చాటాలని కోరారు. ఇంతకీ ప్రధాని మోదీ ఆదివారం రాత్రి 9 గంటలకు, 9 నిమిషాలపాటు ఎందుకు లైట్లు బంద్ చేయమన్నారనే అంశంపై అనేక మంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారన్నది వేరే విషయం. కానీ మోదీ ఇచ్చిన సంకల్ప బలం పిలుపునకు తెలంగాణాకు చెందిన కొందరు బీజేపీ నేతలు మాత్రం సరికొత్త భాష్యం చెబుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ నేత దీన్ని తనదైన శైలిలో సోషల్ మీడియా పోస్టు ద్వారా నిర్వచిస్తున్నారు. అదేమిటో దిగువన మీరే చదవండి.

05-2020- రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దీపం వెలిగించాలి.
అంటే 5+2+0+2+0=9
రాత్రి 9కి 9నిముషాలు
అంతా 9
అమ్మవారి సంఖ్య
ఇంకొక విషయం… ఆ రోజు ఆదివారం మరియు వామన ద్వాదశి, మఖ, పుబ్బ నక్షత్రము లు (సింహరాశి) లో సంచరిస్తున్న సమయంలో దీపం పెడితే సూర్యగ్రహానికి సంబంధించిన వారం, రాశి కనుక భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆరోగ్యం కుదుట పడి చెడు దగ్దం అవుతుందని శాస్త్ర వచనం. అమ్మవారి ఉపాసన మార్గంలో ఉండేవారికి అర్ధం అవుతుంది.
అందుకని అందరూ ఖచ్చితంగా నెయ్యి దీపం పెట్టండి…. శుభం కలుగుతుంది….

మీ
బోడ విజయ్ కుమార్
(బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి)

Comments are closed.

Exit mobile version