దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నియామకాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత కంభంపాటి హరిబాబుకు గవర్నర్ గా అవకాశం దక్కడం విశేషం. రాష్ట్రాల వారీగా కర్నాటకకు థాపర్ చంద్ గెహ్లాట్, గోవాకు శ్రీధరన్ పిళ్లయ్, మిజోరానికి కంభంపాటి హరిబాబు (విశాఖ మాజీ ఎంపీ), హిమాచల్ ప్రదేశ్ కు రాజేంద్రన్ విశ్వనాథ్, హర్యానాకు బండారు దత్తాత్రేయ, మధ్యప్రదేశ్ కు మంగూభాయ్ ఛగన్ భాయ్ పటేల్, ఝార్ఖండ్ కు రమేష్ బయాస్, త్రిపురకు సత్యదేవ్ నారాయణ్ ఆర్యలను గవర్నర్లుగా నియమించారు. వీరిలో కర్నాటక గవర్నర్ గా నియమితులైన థాపర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వార్తల నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఫొటో: మిజోరం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబు